
మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గురువారం జరిగింది.
కుడ్ఘాట్ ప్రాంతంలోని ఐక్యాటన్ క్లబ్ సమీపంలో పూర్బా పుటియరీ పంప్ హౌస్ వద్ద భూగర్భ మురుగుకాలువ వద్ద ఏడుగురు కార్మికులు పనిచేస్తున్నారు.
ఆ ప్రాంతంలోని మ్యాన్‌హోల్‌లో వీరంతా చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని వెలికితీసి సమీప ఆసుపత్రులకు తరలించారు.
అయితే అప్పటికే నలుగురు కార్మికులు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. గాయపడిన మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.
మృతులు మాల్దా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని చేసి దర్యాప్తు చేస్తున్నారు.