హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్‌నగర్ పట్టభద్రుల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.
నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమెను రిటర్నింగ్ అధికారులు వెనక్కి పంపారు.
నామినేషన్ ఫారం సరైన ఫార్మట్ లే లేదని అధికారులు చెప్పడంతో వాణిదేవి వెనుదిరిగారు.
దాదాపు 4 గంటల పాటు రిటర్నింగ్ కార్యాలయంలోనే వాణీదేవి వేచి ఉన్నా ఫలితం లేకపోయింది.
సరైన రీతిలో సవరించిన నామినేషన్ పత్రం స్వీకరణ సమయం దాటిపోవడంతో వాణీదేవి వెనుదిరిగివెళ్లిపోయారు.
రేపు చివరి రోజున టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి పేరును ఆదివారం టీఆర్ఎస్ ప్రకటించింది.
సోమవారం ఉదయం ప్రగతిభవన్‌లో వాణీదేవికి సీఎం కేసీఆర్‌ను బీఫారంను అందజేశారు.