మంచంపై మూత్రం పోశాడని ఐదేళ్ల బాలుడిని ఓ మహిళ హతమార్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూక్కాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
యశ్ ప్రతాప్ అనే ఐదేళ్ల అబ్బాయి తల్లి మూడేళ్ల క్రితం చనిపోయింది. దీంతో ఆ బాలుడిని దగ్గరి బంధువులైన నీరజ్, శైలేంద్రసింగ్ ఇంటి వద్ద తండ్రి వదిలిపెట్టాడు.
ఈ క్రమంలో బాలుడు మంగళవారం రాత్రి బెడ్‌పై మూత్రం పోయడంతో.. నీరజ్‌కు కోపమొచ్చింది. ప్రతాప్ గొంతునులిమి చంపేసింది.
ఆ తర్వాత గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టింది.
ఆపై ఏమీ తెలియనట్లు నీరజ్ వెంట వెళ్తున్న ప్రతాప్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని శైలేంద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటకు పోక్కింది. దీంతో తానే ప్రతాప్‌ను హత్య చేసినట్లు నీరజ్ ఒప్పుకొంది.