హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో మానవత్వం చాటుకున్న ఇద్దరు ముస్లిం సోదరులు

308
two-muslim-brothers-humanity

మతానికి మత్లబ్ లేకుండ…మానవత్వాన్ని చాటుతూ అర్ధరాత్రి ఒంటరిగా వెళుతున్న ఓ మైనర్ అమ్మాయి షాలిని ని తమ ఇంటికి తీసుకెళ్లి అసారా ఇచ్చి తన ఆడపిల్ల లానె మర్యాదలు చేసి పోలిసులకు సమాచారం ఇచ్చి మానవత్వాని చాటుకున్నారు పాతబస్తికి చెందిన ఫారుక్, ఇఫ్తెఖార్ అనే ఇద్దరు అన్నదమ్ములు.

హైదరాబాద్ పాతబస్తికి చెందిన శాలిని పదిహేను సంవత్సరాల మైనర్ అమ్మాయికి చిన్నప్పుడే అమ్మా, నాన్న చనిపోవడం తొ తన బంధువుల వద్ద ఉండేది. వారి తొ సమస్యలు ఉండడంతొ అవేదనకు గురైన అభం శుభం తెలియని ఆ అమ్మాయి జీవితం మీద విరక్తి  చెంది ఏమి చేయాలో తోచని స్థితిలొ  షాహినాయత్ గంజ్ ప్రాంతం నుండి పాతబస్తి మదీన వద్ద అర్దరాత్రి ఒంటరిగా దిక్కులు చూసుకుంటు భయపడుతున్న షాలిని ని గమనించిన కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఇఫ్తేఖార్, ఫారుక్  అనే సోదరులు గమనించి, వీరిలొ ఇఫ్తేఖార్ కు తన సొంతకూతుళ్లు అదే వయసులొ ఉండటం తొ వారితో హాయిగా ఉంటుందన్న భావనతొ షాలినికి ధైర్యం చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లి రాత్రి కంటికి రెప్పలా చూసి ఓ నాగరికుడులా ఎలాంటి కులమత బేధాలు లేకుండ భిన్నత్వంలొ ఏకత్వాన్ని పలుకుతు మానవత్వానికి మతం అడ్డురాదంటు నిరూపించారు.

మరుసటి రోజు చార్మినార్ ఎసిపి, చార్మినార్ సిఐ కి తెలియచేసి మైనర్ అమ్మాయి భవిశ్యత్తు కు ఎలాంటి ఇబ్బంది రాకుండ అమ్మాయి అభిప్రాయం మెరకు పొలిసు ఉన్నతాధికారుల సమక్షంలొ మిడియా సమావేశంలో అనాధాశ్రమం కు తరలించారు.

పట్టపగలే మహిళలు, ఆడపిల్లలు బయటికి వెళ్లడానికి భయపడుతున్న ఈ సమయంలొ అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న మైనర్ అమ్మాయికి ఎలాంటి అఘాయిత్యం జరగకుండ మానవత్వాని చాటి పొలిసులకు తెలిపిన ఇఫ్తెకార్ మరియు ఫారుక్ లను చార్మినార్ ఎసిపి అశోక్ చక్రవర్తి, చార్మినార్ సిఐ ప్రశంసించారు.