న్యాయవాదుల హత్యకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే:జీవన్ రెడ్డి

169
TRS govt. responsible for killing lawyers:Jeevan Reddy

పెద్దపల్లి జిల్లాలో హై కోర్ట్ న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదుల హత్యకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.

ఈ హత్యలో టీఆర్ఎస్ పెద్దల ప్రోత్సాహం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఈ హత్యలను ఖండించక పోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.

అక్రమ మార్గంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్‎కు నిధులు సమకూర్చుతున్నారని ఆరోపించారు.

న్యాయవాదులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకే న్యాయవాద దంపతులను హత్య చేశారని ఆరోపించారు.

ఈ కేసులో ట్రస్ట్ నిర్వాహకులను ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. న్యాయవాదుల హత్యలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.