తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున శాసనసభకు పోటీచేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఇందులో 16 మంది సిటింగుల జాబితా వివరాలివి. నల్లగొండ నుంచి కంచర్ల భూపాల రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖారయినట్టు సమాచారం ఉన్నది.
ఆర్మూర్-జీవన్ రెడ్డి
కరింనగర్-గంగుల కమలాకర్
దుబ్బాక-సోలిపేట రామలింగా రెడ్డి
*రామగుండం-సోమరపు సత్యనారయణ
మంథని – పుట్ట మధుకర్
జడ్చర్ల-లక్ష్మారెడ్డి
సిద్ధిపేట -హరిష్ రావు
కుత్బూల్లాపూర్ – వివేకానంద
ధర్మపురి -కోప్పుల ఈశ్వర్
నల్గగోండ-కంచర్ల భూపాల్ రెడ్డి
నకిరేకల్-వేముల విరేశం
మేడ్చల్-సుధీర్ రెడ్డి
బోథ్ -రాథోడ్ బాపు రావ్
నిర్మల్-ఇంధ్రకరణ రెడ్డి
మక్తల్ – రాంమోహన్ రెడ్డి
ఇల్లెందు-కోరం కనకయ్య.
ఇక కొందరు సిట్టింగ్ శాసనసభ్యుల పరిస్థితి డోలాయమానంలో ఉన్నది. ‘ అవుట్ లేదా డౌట్’ కేటగిరీలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు;
బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య
చెన్నూరు – నల్లాల ఓదేలు
వికారాబాద్ – సంజీవ రావు
ములుగు – చందులాల్
మల్కాజ్ గిరి – కనకా రెడ్డి
పెద్ద పల్లి – మనోహర్ రెడ్డి
అశ్వారావు పేట – తాటి వెంకటేశ్వర్లు
స్టేషన్ ఘన్ పూర్ – డాక్టర్ రాజయ్య
మాబూబాబాద్ – శంకర్ నాయక్,
జనగామ – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
తదితరుల పేర్లు తెలంగాణ భవన్ వర్గాల నుంచి వెలువడుతున్నవి.
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ చెన్నూరు నుంచి అసెంబ్లీ కి పోటీ చేసే అవకాశాలున్నవి.
మాజీ మంత్రి జి. వినోద్ బెల్లంపల్లి నుంచి పోటీ చేయవచ్చును. సుమన్ చొప్పదండి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే చొప్పదండి లో సిట్టింగ్ ఎమ్మెల్యే శోభ ను మార్చే అవకాశాలు లేవని తాజా సమాచారం అందుతున్నది. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీ బలాబలాలను, సిట్టింగ్ శాసనసభ్యుల పరిస్థితిని పెద్దపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయనున్న డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిలాలోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు పెద్దపల్లి పరిధిలో ఉన్నవి.
మల్కాజిగిరి కనకారెడ్డిని తప్పించవలసి వస్తే అక్కడ మైనంపల్లి హనుమంతరావు బరిలో ఉండడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్సీ మైనంపల్లి మంత్రి కేటీఆర్ విశ్వాసపాత్రునిగా గుర్తింపు పొందారు. పెద్దపల్లి లో ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి ని తప్పించవలసి వస్తే సారయ్యగౌడ్ కి అవకాశం తథ్యం. నిజామాబాద్ జిల్లా బోధన్, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యేలు షకీల్, రేఖానాయక్, బాబూమోహన్ ల పరిస్థితిపై స్పష్టత రావలసి ఉన్నది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు పట్ల అక్కడ ప్రజల్లో ‘వ్యతిరేకత’ ఉందంటూ సమాచారం ‘ప్రగతి భవన్’ కు అందుతున్నది. అయితే ‘వెలమ’ కులానికి చెందిన జలగం ను మార్చుతారా లేదా అన్నది తెలవలసి ఉన్నది.కేసీఆర్ కరుణిస్తే కొత్త గూడెం నుంచి అసెంబ్లీ కి పోటీ చేయాలన్నది ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమతం. గోపాలరావు అనే నాయకుడు సైతం టిఆర్ఎస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గోపాలరావుకు ఎం.పి. కవిత ఆశిస్సులున్నాయని ఖమ్మం జిల్లాలో ప్రచారం జరుగుతున్నది