వాకింగ్ చేస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ దారుణ ఘటన గురువారం ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకుంది.
మృతులు ముగ్గురు స్థానిక ఎనికాస్ రేడియో, టీవీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం జలాలాబాద్‌లో నివసిస్తున్న సాదియా, షెహనాజ్‌లు ఇంటికి సమీపంలో వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు.
దాంతో వీరిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. .కాగా, మరో ప్రాంతంలో ముర్సాల్ హబీబీ అనే ఉద్యోగిపై కూడా కాల్పులు జరిపారు. ఆమె కూడా స్పాట్‌లోనే చనిపోయింది.
వీరు ముగ్గురు గత కొంతకాలంగా భారతదేశానికి చెందిన సీరియళ్లను స్థానిక భాషల్లోకి డబ్బింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నరని ఎనికాస్ టీవీ డైరెక్టర్ జలమాయ్ లతీఫ్ చెప్పారు.
పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.