ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

161
car crashed into a canal .. Two killed one lost!

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు.

ఈ ఘటన ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాతి ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. లావాడియా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తలవాలిచందా వద్ద పెట్రోల్ పంప్ ముందు ఆగి ఉన్న ఖాళీ పెట్రోల్ ట్యాంకర్‌ను దేవాస్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరిని చికిత్సకు తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు  హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మృతులంతా విద్యార్థులుగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.