నాలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

148
Corona to the staff .. Restaurant‌ siege

దేశంలో కరోన వైరస్ మళ్లీ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా, 4,421 కేసులు వచ్చాయి.

నవంబర్ నెలలో 24వ 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి.

వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది.

ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం.