తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

323
telangana-inter-results-released

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం, మంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ఫలితాలను శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. ఇంటర్ రెండో సంవత్సరంలో 2,83, 772 మంది (67.25 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో మాత్రం 2,84,224 మంది (62.35 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.



బాలికలదే పైచేయి..

మేడ్చల్, కొమరంభీం జిల్లాల్లో 80 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, 77 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. 40 శాతం ఉత్తీర్ణతతో మూడోస్థానంలో మెహబూబాబాద్ జిల్లా నిలిచింది. కాగా, ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌లు స‌త్తా చాటారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 69శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురులో 55.66శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు 73.25 శాతం, బాలురులో 61శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.