కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తూనే వుంది అని అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. యువకుల బలిదానాలతో గద్దెనెక్కిన కెసిఆర్ పూర్తిగా మర్చిపోయారన్నారు ఎమ్మెల్సీ.
MLC ఎన్నికల్లో భాగంగా తీన్మార్ మల్లన్న మెహబూబాద్ జిల్లా డోర్నకల్ లో ప్రచారం చేసారు.
కెసిఆర్ ఎక్కడ ప్రచారం లో దిగిన ఇవే దొంగ మాటలు, ఇవే దోపిడీ మాటలు అని దుయ్యబట్టారు.
గత ఎన్నికల్లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించారని ఆరోపించారు మల్లన్న.
మార్చ్ 14 వ తేదీన జరిగే ఎన్నికలో పట్టభద్రులంతా ఒక ప్రశ్నిచే గొంతుకను గెలిపించి చట్టసభకు పంపాలని కోరారు.