ఎన్నికల్లో టిడిపి విజయం తథ్యం… బిజెపి టివి సర్వే చెప్పిన పచ్చి నిజం

339
Chandrababu,Jagan

2019 General Elections లో ఎవరు గెలుస్తారు? Andhra Pradesh లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ! పాదయాత్ర వల్ల YS Jagan Mohan Reddy కి ఆదరణ వచ్చింది… అటు TDP మీద కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ అధికార కాలంలో చాలా మంచి పనులు చేయడంతో అనుకూల వాతావరణమూ ఉంది. దీంతో గెలుపెవరన్నది ఓ అంచనా వేయలేకపోతున్నారు జనాలు, రాజకీయ విశ్లేషకులు! అయితే… Survey లు మాత్రం దాదాపు టిడిపికే విజయం వరిస్తుందని జోస్యం చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు, ప్రజల నాడి, ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయాల దృష్ట్యా… అధికార పీఠం మళ్ళీ తెలుగుదేశం పార్టీకే దక్కుతుందంటున్నారు.

తాజాగా BJP కి చెందిన Republic అనే National News Channel కూడా ఇదే విషయం వెల్లడించింది. 25 Lok Sabha స్థానాల్లో టిడిపి 14, వైసిపికి 11 సీట్లు వస్తాయని ఓ నివేదిక వెల్లడించింది. నిజానికి… ఇది ఛానెల్ టిడిపికి కేవలం 5 లోక్‌సభ స్థానాలే వస్తాయని నవంబర్‌లో వెల్లడించింది. ఆ తర్వాత జనవరిలో 6 వస్తాయని పేర్కొంది. కానీ… మార్చి నెల వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొంటూ… టిడిపికి 14 స్థానాలు రావడం తథ్యమని జోస్యం చెప్పింది. మరి… ఇది నిజమవుతుందో? లేదో? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వెయిట్ చేయాల్సిందే!