టీడీపీ వైపు అడుగులు వేస్తున్న మరో వైసీపీ ఎమ్మెల్యే

418
Desai Thippa Reddy

మరో వారంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి రాజకీయ నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తున్నవారికంటే..వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారు. మదనపల్లి వైసీపీ టిక్కెట్ మైనారిటీ నేతకు ఖరారు చేశారని ప్రచారం జరుగుతుండడంతో…ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు.

మదనపల్లె టిడిపి టికెట్ కోసం ఇప్పటికే నేతలు క్యూ కట్టి అమరావతిలో ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త వ్యక్తికి టిడిపి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె టిడిపిలో బహుళ నాయకత్వం కారణంగా టిడిపి అధినేత కొత్త నేత కోసం అన్వేషణ చేస్తున్న తరుణంలో వైకాపా ఎంఎల్ఎ దేశాయ్ తిప్పారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎంఎల్ఎ టికెట్ ఇవ్వలేని పక్షంలో ఎంపి టికెట్ ఇవ్వడానికి సైతం తెలుగుదేశం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు రోజులలో ఏదోక టికెట్ తో తిప్పారెడ్డి నామనేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది…