విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు: చంద్రబాబు

134
Sharmila is fighting with Jagan:Chandrababu

విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

లక్షల మంది ప్రజలు ఏళ్ల తరబడి ఉద్యమించారని ఆయన గుర్తు చేశారు. 32 మంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. అమరావతి వాసి అమృతరావు ఆమరణ నిరాహార దీక్షతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నామని వివరించారు. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

జగన్ గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 18 వేల మంది పర్మినెంటు ఉద్యోగులు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యక్షంగానూ, లక్ష మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే ఒక సీఎంగా నీ బాధ్యత ఏంటని ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు.