కోదండరాం కు ఒక లైన్ క్లియర్ – తలసాని సభ వాయిదా

1397
talasani-kuruma-public-meeting-postponed

యాదవ, కురుమల శంఖారావం వాయిదా

గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 29న పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న శంఖారావం సభ వాయిదా పడింది. సబ్సిడీ గొర్రెల పంపిణీ నేపథ్యంలో లక్షల మంది గొల్లకురుమలతో సభను ఏర్పాటు చేసి ఈ సభకు సీఎంను ఆహ్వానించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ నిర్ణయించారు. అయితే సభకు రక్షణశాఖ అనుమతిలో జాప్యం ఒక కారణమైతే, వేసవిని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసినట్లు తలసాని ప్రకటించారు. సభ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.