దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హోటల్ గదిలో శవమై కనిపించడం సంచలనం సృష్టించింది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది.
సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.
దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. గతేడాది దాద్రా నగర్ హవేలిలో స్థానిక ఎన్నికల కోసం జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు.