ఉరేసుకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

156

ఉరేసుకొని మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ లో చోటు చేసుకొంది.

వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన నడిశెట్టి బాలశ్రీధర్ (44) గత నాలుగేళ్లుగా టీసీఎస్ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు.

గతంలో ఆయన బంధువులు, స్నేహితులకు అప్పులు ఇచ్చాడు. అవి వసూలు కాకపోవడంతో ఇతరుల వద్ద అప్పులు చేశాడు.

అప్పులు చెల్లించడం కష్టం కావడంతో గతంలోనే ఒక సారి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మనోవేదన అనుభవించాడు.

ఆదివారం ఉదయం ఆయన భార్య పద్మ పిల్లలను తీసుకుని డీమార్డ్ కు వెళ్లింది.

అదే సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.