టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీను సస్పెండ్

338
Suspended Kunta Srinu from TRS

తెలంగాణలో హైకోర్ట్ న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిలను దారుణంగా హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనున పార్టీ నుంచి హైకమాండ్ సస్పెండ్ చేసింది.

మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న కుంట శ్రీనును సస్పెండ్ చేస్తూ ఈ మేరకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ హత్య కేసులో ఏ1 కుంట శ్రీను, ఏ2గా చిరంజీవి, ఏ3గా అక్కుపాక కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గట్టు వామన రావు దంపతుల హత్యకు గుంజపడుగు గ్రామంలో నెలకొన్న వివాదాలే కారణంగా తెలియవచ్చింది.

వామనరావుపై కుంట శ్రీను కత్తితో దాడికి పాల్పడగా, నాగమణిపై చిరంజీవి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు.

అనంతరం నిందితులు సుందిళ్ళ బ్యారేజి దగ్గర రక్తపు బట్టలు మార్చుకున్నారు. కత్తులను బ్యారేజీలో పడేసి మహారాష్ట్ర వైపు బయలుదేరారు. ఈ ఘటనలో రామగిరి పోలీసు స్టేషన్ సిబ్బంది పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.