ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత ఆత్మహత్య

289
Engineering student commits suicide in college

ఏపీలోని చిత్తూరు జిల్లా ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి (52) నిన్న సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బోడుమల్లెవారి పల్లెకు చెందిన వెంకట రమణారెడ్డి పీలేరు-కల్లూరు సమీపంలో ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు.

నిన్న సాయంత్రం కాలేజీ ముగిసిన అనంతరం కారులో కొడిదిపల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు.

అదే సమయంలో తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్ రైలు వస్తుండడంతో సిబ్బంది గేటు వేశారు.

దీంతో తినేందుకు ఏమైనా తీసుకురావాలంటూ డ్రైవర్‌ను పంపించాడు. అనంతరం కారు దిగి ట్రాక్ పక్క నుంచి పీలేరు దిశగా నడవడం మొదలుపెట్టారు.

రైలు వస్తున్న విషయాన్ని గమనించి అకస్మాత్తుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.