జూనియర్‌ డాక్టర్లకు స్టైపండ్‌ పెంపు

493
stipend hike to ap junior doctors

ఆంధ్రప్రదేశ్ లోని జూనియర్‌ డాక్టర్ల స్టైపండ్‌ను పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి వస్తుంది. జీవో ప్రకారం ప్రస్తుతం హౌస్‌సర్జన్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు అందిస్తున్న స్టైపండ్‌ రూ.12,167 నుంచి రూ.15,817కి పెరిగింది. పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా విద్యార్థుల స్టైపండ్‌ కూడా రూ. 8 వేల మేర పెరిగింది. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు రూ.9 వేలు, ఎండీఎస్‌ వైద్యులకు రూ.8 వేల వరకూ పెంచారు.