శ్రీరాం నగర్ కాలనీ బి బ్లాక్ నూతన కార్యవర్గం

255
new committee meeting

శ్రీరాం నగర్ కాలనీ బి బ్లాక్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కంకణబద్దులుగా ఉండి పనిచేయాలని శాసన సభ్యులు అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ రాం‌నగర్ కాలనీ బి బ్లాక్ ఓనర్స్ అండ్ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యాలయాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు ప్రారంభించారు.



ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 70 లక్షలతో యూజీడీ పనులు నడుస్తున్నాయని, త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపారు. యూజీడీ పనుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారని అందుకు కారకులైన అధికారులపై, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 20 లక్షల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్,‌ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణంతో కొన్నేళ్లుగా నెలకొన్న నీటి‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కానుందన్నారు‌. ఇప్పటి వరకు ఉన్న కార్యవర్గం చాలా కృషి చేసిందని, కాలనీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కూడా ఐకమత్యం తో ప్రణాళిక బద్దంగా పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, నాయకులు రక్తపు దశరత్ గౌడ్, శ్రీకాంత్, రమేష్, మహేష్, మాజీ అధ్యక్షుడు బేగ్ తో పాటు నూతన కార్యవర్గం అధ్యక్షుడు వి. జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కార్తిక్, వెంకటేశ్వర్ రావు, జనరల్ సెక్రటరీ క్రాంతి కుమార్, జాయింట్ సెక్రటరీలు సంతోష్, శ్రీనివాస్, కోశాధికారి సాంబ శివరావు, చీప్ అడ్వయిజరీలు హమీద్ హుసేన్ బేగద, రాధా కృష్ణన్, సతిష్ బాబు, శివ ప్రసాద్, ప్రసాద్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నాగరాజు, సురేష్ బాబు, శేఖర్, లీగల్ అడ్వయిజరీ శ్రీనివాస్ తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కాలనీ‌ వాసులు పాల్గొన్నారు.