పేదలకు ఇల్లు నిర్మించి స్వంత ఇంటి కల నెరవేరుస్తా: పోచారం

205
Pocharam TRS

 నియోజకవర్గం పరిధిలోని ఇల్లులేని పేదలందరికీ ఇల్లు నిర్మించి స్వంత ఇంటి కల నెరవేరుస్తానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ మండలం పులికుచ్చ తండాలో రూ. 50.40లక్షలతో నూతనంగా నిర్మించిన రెండు పడకల ఇళ్లను పోచారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఇళ్లు లేని పేదలకు అన్నివసతులతో సబ్సిడీపై డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ఏదో నామ్‌కే వాస్తేగా డెబ్బయ్‌ వేల రూపాయలు ఇస్తేదానిని కూడా బినామీల పేరుతో బ్రోకర్లు దోచేసుకున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తండాలను పంచాయితీలుగా మార్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. . ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.