తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన తనయుడు

247
son beat his father to death with iron rod

తాగుడుకు బానిసై ఓ కొడుకు కన్నతండ్రినే హతమార్చాడు. మద్యం మత్తులో కన్నతండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు.

ఈ దారుణ ఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. జిల్లాలోని బిజినేపల్లికి చెందిన నరసింహ (55), మహేష్ తండ్రీ కొడుకులు. అయితే నిన్న రాత్రి మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో ఆవేశంతో మహేష్‌ తన తండ్రిని ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రైకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.