సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులపై కేంద్రం దృష్టి సారించింది.
ఫేక్ న్యూస్ వ్యాప్తికి కారణమవుతున్నాయంటూ సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఓటీటీ, డిజిటల్ మీడియా విజృంభణకు కళ్లెం వేయాలని కేంద్రం సంకల్పించింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
టెక్ కంపెనీలపై ఆధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ ముసాయిదాను తయారు చేసింది.
ఈ మేరకు నూతన మార్గదర్శకాలు నోటిఫై చేసినట్టు కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ మీడియాను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్రం వెల్లడించింది.
చట్ట విరుద్ధ, తప్పుడు సమాచార నియంత్రణకు కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రత్యేకంగా ఓటీటీల కోసం మూడంచెల విధానాన్ని నిర్ణయించామని వివరించింది.
ఓటీటీ కంటెంట్ కు వయసు ఆధారంగా వర్గీకరణ ఉండాలని స్పష్టం చేసింది. ఓటీటీలను పిల్లలు చూడకుండా నియంత్రించే సదుపాయం ఉండాలని పేరొర్కంది.
ఇకపై ఓటీటీ, డిజిటల్ మీడియా సంస్థలు తమ వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఓటీటీ, డిజిటల్ మీడియా సంస్థలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరికాదని పేర్కొంది.