రక్త దాతలే మన ప్రాణ దాతలు – మంత్రి నిరంజన్ రెడ్డి

493
Vijayamma foundation

ప్రమాద పరిస్థితుల్లో రక్తదాతలు అందించే రక్తం ద్వారా ప్రాణాలు నిలుస్తాయని, ఆ రక్తదాతలే మన ప్రాణదాతలని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆయన కొప్పుల ఈశ్వర్ మరియు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి అదివారం గోదావరిఖని లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిచారు.

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఐటి శాఖమాత్యులు కేటిఆర్ గారి పిలుపు మేరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. రక్తదాతలు అందించే రక్తం పలువురి జీవితాలను కపాడుతాయని, ప్రతి ఒక్కరు విధిగా రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. 150 మంది విజయమ్మ పౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు.

Hospital

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, మేకల సదానందం నాయకులు పాత పెత్తి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, కాల్వ శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావన్, అబ్బాస్, శ్రీకాంత్, సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.