చేయూత చెక్కులను పోలీస్ కుటుంబాలకు అందజేసిన నల్గొండ ఎస్పీ

460
Cheyutha Cheques

చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. ఇటీవల మరణించిన ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్, ఏ.ఎస్.ఐ కుటుంబాలకు చేయూత పథకం కింద చెక్కులను ఆయన అందజేశారు.

ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన కట్టంగూరు ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ ఎం.మల్లేషం మరియు ఏ.ఎస్.ఐ ఎస్.వెంకన్న కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున చేయూత పథకం చెక్కులు ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది వీలైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

cheyutha cheques

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, వెల్ఫేర్ ఆర్.ఐ. నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు.