ఇంటర్‌ విద్యార్థినిపై లైంగిక దాడి!

449
Sexual assault Inter‌ student

లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

ప్రేమపేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేశాడు.

పలుసార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడడంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : మంచంపై మూత్రం పోశాడ‌ని

ఎల్లారెడ్డిపేట పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో విద్యార్థినికి దగ్గరయ్యాడు.

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.