స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ, వాహన రుణం 59 నిమిషాల్లో

210

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వచ్చే పండుగ సీజన్‌లో రుణాలను తీసుకునేవారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో గృహ, వాహన రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. రుణాల పరిధిని మరింత పెంచుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులైతే ఏకంగా గృహ, వాహన రుణాలను 59 నిమిషాల్లో అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించాయి. psbloansin59minutes పోర్టల్ ద్వారా ప్రస్తుతం కోటి రూపాయల వరకు రుణాలను చిన్న, మధ్య స్థాయి వ్యాపారవేత్తలకు అందిస్తుండగా, ఈ పరిధిని రిటైల్ రుణాలకు వర్తించనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఎస్బీఐతోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులు రూ.5 కోట్ల వరకు రుణాన్ని ఈ పోర్టల్ ద్వారా అందిస్తున్నాయి.

గృహ, వాహన రుణాలను ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురావడానికి చర్య లు తీసుకుంటున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ స్వాన్ తెలిపారు. మరో బ్యాంకైన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నది. 59 నిమిషాల్లో సూత్రప్రాయంగా ఆమోదం లభించిన తర్వాత ఆయా సంస్థలకు 7 నుంచి 8 పనిదినాల్లో రుణం మంజూరుకానున్నది. ఎంఎస్‌ఎంఈలకు ఆర్థికంగా చేయూతనందించే ఉద్దేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 2018లో ఈ ప్రత్యేక సేవలను ఆరంభించారు. ఈ పోర్టల్ సేవలు ఆరంభించిన నాలుగు నెలల్లో నే రూ.35 వేల కోట్లకు పైగా రుణాల ను మంజూ రు చేసింది. మార్చి 31, 2019 నాటికి 50 వేల దరఖాస్తులు రాగా, వీటిలో 28 వేల ప్రతిపాదనలకు సూత్రప్రాయ అనుమతులు లభించాయి.