తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలనే డిమాండ్‌తో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు టీఆర్‌ఎస్‌వీ నాయకుడు బీటెక్ తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కన్యాకుమారిలో ఈ పాదయాత్రను ప్రారంభిస్తానని తెలిపారు. దాదాపు 3,500 కిలోమీటర్ల మేర 5 నెలలపాటు కొనసాగనున్నఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుందని, పాదయాత్ర హైదరాబాద్‌కు చేరిన తర్వాత సీఎం కేసీఆర్‌ను కలుసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ నామకోటి పుస్తకాలను ఆయనకు అందజేస్తానని తెలిపారు .
ఈ పాదయాత్రలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన తీరు, రాష్ట్రంలో ఉత్తమ పాలనను అందించడం ద్వారా నంబర్ 1 ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన అంశాలతోపాటు ఆయన అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. బీటెక్ తేజతోపాటు నాంపల్లికి చెందిన ఏ ధర్మతేజ, అబిడ్స్ ఎస్సీ హాస్టల్‌కు చెందిన సీహెచ్ సాయికుమార్, పవన్, గణేశ్ పాదయాత్రలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.