ఎస్‌బీఐ కస్టమర్లకు లేటెస్ట్‌ ఆఫర్‌

269
sbi-account-zero-minimum-balance-till-august-2018

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 2018 ఆగస్టు వరకు ఎలాంటి కనీస మొత్తం(మినిమమ్‌ బ్యాలెన్స్‌) అవసరం లేకుండా అకౌంట్‌ ప్రారంభించుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. సేవింగ్స్‌ అకౌంట్లలో ఎలాంటి మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేదనుకునే వినియోగదారులకు ఈ తాజా ఆఫర్‌ గొప్ప అవకాశమని పేర్కొంది. ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ పేరుతో ఈ అకౌంట్‌ను తెరుచుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ను ప్రారంభించడానికి బ్యాంకుకు కూడా వెళ్లాల్సినసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చని బ్యాంకు తెలిపింది.

ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌….

  • ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు
  • ఎలాంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పించాల్సివసరం లేదు. ‘పేపర్‌లెస్‌ అకౌంట్‌ ఓపెనింగ్‌’ ను ఇది ఆఫర్‌ చేస్తోంది.
  • వెంటనే ఈ అకౌంట్‌ను యాక్టివేట్‌ చేసుకోచవ్చు.
  • కస్టమర్లు ఎవరైతే ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభిస్తారో ఆ వినియోగదారులు రూపే డెబిట్‌ కార్డు పొందుతారు.
  • లక్ష రూపాయల వరకు ఈ అకౌంట్లో మెయిన్‌టైన్స్‌ చేసుకోవచ్చు.
  • ఏడాది లోపు ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్‌ అకౌంట్‌ను రెగ్యులర్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి మార్చుకోవచ్చు.
  • 2018 ఆగస్టు వరకు ఈ అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచుకోవాల్సినవసరం లేదు.
  • 18 ఏళ్ల పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు
  • యోనో మొబైల్‌ యాప్‌లో ఈ సేవింగ్స్‌ అకౌంట్‌ను దరఖాస్తు చేసేటప్పుడు యూజర్లు, ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.