అక్కినేని మూడోతరం వారసుడు నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత సమంత వరుస సక్సెస్‌లు సాధిస్తుంది. ఇటీవల ఓ బేబి చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన సమంత ప్రస్తుతం 96 రీమేక్ చిత్రంలో నటిస్తుంది. తమిళ వర్షెన్‌ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో కెమెరామెన్‌గా కనిపించనున్నాడు.
సెప్టెంబర్ 16 నుండి చిత్రానికి సంబంధించి మరో షెడ్యూల్ మొదలు కానుంది. అక్టోబర్ లేదా నవంబర్ తొలి వారంలో చిత్ర షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత సమంత పలు ప్రాజెక్టులలో నటిస్తుందని వార్తలు వస్తుండగా, అవన్నీ అవాస్తవాలు అంటున్నారు. 96 రీమేక్ తర్వాత కొద్ది రోజుల పాటు సమంత సినిమాలకి బ్రేక్ తీసుకొని పిల్లలకోసం ప్రణాళికలు వేసుకుంటుందని సమాచారం.