పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. మంచిర్యాల గౌతమ్‌నగర్‌లోని ఎంపీ సుమన్ నివాసంతో పాటు మరో మూడు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు పోలీసులు నిర్ధారించారు. మిగతా ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో లెక్కలు తెలియడం లేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడం ఇది రెండోసారి. చోరీ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.