ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ తల్లి కమలా కుమారి(73) కొండాపూర్ లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రావు రమేష్ అప్పటి నటుడు రావు గోపాలరావు తనయుడు అన్న సంగతి తెలిసిందే. కమలా కుమారి స్టేజ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆమెకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. చాలా స్టేజ్ షోస్ ఇచ్చిన కమలా కుమారి హరికథలతో పాపులర్. ఓ స్టేజ్ షో ద్వారా రావుగోపాల రావు, కమలా కుమారి మధ్య పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి పెద్ద కొడుకు రావు రమేష్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌లలో ఒకరు .