ఘోర రోడ్డు ప్రమాదం..వాహనంలోనే డ్రైవర్ మృతి

217
Truck overturns 16 killed
A fatal motor accident involving a minivan, car and school bus on State Highway 12, north of Dargaville. 13 May 2016 Northern Advocate photograph by Michael Cunningham. WGP 30Jun16 - MORE than $10 million will be spent improving safety on State Highway 57. PHOTO: SUPPLIED WGP 01Feb19 - A young cyclist was hit by a car in Levin on Monday morning. RGP 06Nov19 - Everyone who gets behind the wheel has the responsibility to drive safely. BTG 06Nov19 - Everyone who gets behind the wheel has the responsibility to drive safely.

 

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బాల్కొండ సమీపంలోని ఈ ఘటన చోటుచేసుకుంది.

జాతీయ రహదారి 44పై ఈరోజు తెల్లవారుజామున మూడు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు.

ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే రెండు లారీలు ఒకదాన్ని ఒకటి ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీకొన్నాయి.

ఆ తర్వాత మరో కంటైనర్‌ వేగంగా వచ్చి ప్రమాదానికి గురైన లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కంటైనర్‌ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అతడిని బయటికి తీసేందుకు పోలీసులు శ్రమించినా ఫలితం లేక పోయింది.

కొద్ది సేపటికి కంటైనర్‌ డ్రైవర్‌ వాహనంలోనే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.