రిలయన్స్ జియో సరికొత్త బంపరాఫర్!

254
Reliance Jio latest bumper offer!

 

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో భారీ సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకోంది.

తాజాగా రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం మరో బంపరాఫర్ ను ప్రకటించింది.

అతి త్వరలోనే రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది.

అంతే కాదు, ఆ ఫోన్ కొనుగోలు చేసేవారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత కాల్స్ ఇస్తామని చెప్పింది.

అంతేకాకుండా, నెలకు 2 గిగాబైట్ల డేటాను ఉచితంగా వాడుకోవచ్చని, రెండేళ్లలో మొత్తం 48 జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది.

ఇదే సమయంలో రూ. 1,499 ధరలో మరో ఫోన్ ను విడుదల చేస్తున్నామని పేర్కొంది.

ఈ ఫోన్ తో ఏడాది పాటు అపరిమిత కాల్స్, నెలకు 2 జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది.

ఇక ఇప్పటికే జియో అందిస్తున్న ఫీచర్ ఫోన్ ను వాడుతున్న వినియోగదారులు, రూ. 749తో రీచార్జ్ చేసుకుంటే, రెండేళ్లు అమలులో ఉండే ఇవే ఆఫర్లు పొందవచ్చని తెలిపింది.