ఏపీ, తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఏపీలో రెండు ఉపాధ్యా ఎమ్మెల్సీలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగాలి.
ఈ నాలుగు స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 16న జారీ చేస్తారు. మార్చి 14న పోలింగ్ నిర్వహిస్తారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.