రాధికా ఆప్టే.. బాలీవుడ్ హీరోయినే కాదు తెలుగులోనూ రక్తచరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈమె ఎక్కువగా బాలీవుడ్, వెబ్‌సిరీస్‌లపైనే ఫోకస్ పెడుతున్నారు. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రస్తుతం ద వెడ్డింగ్ గెస్ట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన రొమాంటిక్ సీన్ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అయితే ఆ సీన్‌లు తన పేరుతో ప్రచారం కావడంతో రాధిక ఆగ్రహం వ్యక్తం చేసింది. మేల్ యాక్టర్ దేవ్ పటేల్ కూడా ఈ సీన్ లో నటించాడు. కాని అతని పేరిట స్ప్రెడ్ చేయకుండా, నా ఒక్క పేరుతో ఎందుకు షేర్ చేస్తున్నారని ఫైర్ అయింది రాధికా. అలానే సినిమాలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయి. కాని శృంగారానికి సంబంధించిన సీన్స్ మాత్రమే లీక్ చేశారు. ఇందుకు కారణం మన సమాజం సైకోటిక్ మెంటాలిటీనే అని తెలిపారు.
నేను చిన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగాను. పలువురిని కలిసాను. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. మనదేశంలోనే కాక విదేశాలలోను నటులు వేదిక మీద నగ్న ప్రదర్శనలు ఇవ్వడం చూసాను. బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకెలాంటి భయాలు లేవు. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి. నటన విషయంలో నా శరీరం కూడా నాకు సాధనం లాంటిందే అని బాలీవుడ్ లైఫ్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది రాధిక.