ముద్దు సీన్ ఫై అమలా పాల్ కాంట్రవర్సి

236

తను ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేముందని కథానాయిక అమలాపాల్‌ అంటున్నారు. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన సినిమా ‘ఆమె’. రత్న కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అమలాపాల్‌ నగ్నంగా కనిపించారు. ఆమె పాత్ర కూడా విభిన్నంగా అనిపించింది. ఈ నెల 19న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా ట్రైలర్‌లో అమలాపాల్‌ తన సహనటి ఆర్జే రమ్యను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

తొలుత ఈ ముద్దు సన్నివేశం గురించి మీడియా అమలాపాల్‌ను ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేంటి? ఆ షాట్‌ అనుకోకుండా వచ్చింది, అది స్క్రిప్టులో లేదు. ఓసారి పాత్రలో లీనమైతే.. ఇక మన స్వభావాన్ని పక్కన పెట్టినట్లే. ఈ చిత్రం శృంగారం నేపథ్యంలో సాగేది కాదు. ఈ సినిమా కంటెంట్‌ అర్థం చేసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. నిజానికి ఈ చిత్రం నటిగా నాకు ఇంకాస్త నమ్మకం, బలాన్ని ఇచ్చింది. తొలుత ఆ సన్నివేశాల్లో ఎలా నటించాలని ఆలోచించా. కానీ ఓసారి కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత.. సౌకర్యంగానే ఉన్నా. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలోని ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చింది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నగ్న సన్నివేశాల గురించి మా అమ్మకు చెప్పా. అలాంటి సీన్లు స్క్రిప్టుకు కచ్చితంగా అవసరం అనిపిస్తే నటించమన్నారు’ అని ఆమె అన్నారు అంటూ చెప్పుకొచ్చింది.