బిచ్చగాడి కంటే కత్తి మహేష్ పరిస్థితి దారుణమంటూ ట్వీట్ చేసి అప్పట్లో వివాదాన్ని రేకెత్తించిన పూనమ్ కౌర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది.
183షేర్ లు..185కామెంట్లు, 3.4కె లైకులు ఇవీ హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన ఓ అయిదు లైన్ల పోస్టుకు వచ్చినవి. ఇంతకీ అమ్మడు పెట్టిన పోస్టు్ ఏమిటి?
కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలని అడ్డంపెట్టుకుంటూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని.. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురాలేకపోయినా.. ప్రతి మాట పవన్‌ని ఉద్దేశించినవేనని ఆమె తరపు వర్గం, పవన్ వ్యతిరేక వర్గం ప్రచారం మొదలు పెట్టింది.
ఇదిలా ఉంటే.. జనసేన ఆవిర్భావ మహాసభలో తన ప్రసంగం ద్వారా రాజకీయ వర్గాల్లో హీట్ పెంచేసిన పవన్ కల్యాణ్‌పై విమర్శల జోరు పెరిగింది. కానీ అధికార టీడీపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ కూడా పవన్ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని.. తద్వారా పరోక్షంగా జనసేనానిపై విమర్శలు గుప్పించిందని పవన్ వర్గీయులు గుర్రుగా వున్నారు.
ఇంతకీ పూనమ్ కౌర్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టినట్లు? ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు? పైగా పవన్ నిన్నిటికి నిన్న తెలుగుదేశం ప్రభుత్వం పైన, లోకేష్, చంద్రబాబుపైనా విమర్శలు చేసిన తరువాతే ఈ పోస్ట్ రావడం యాధృచ్ఛికమా? మరేమైనా వుందా? ఏమున్నా లేకపోయినా, ఈ పోస్టు స్క్రీన్ షాట్ మాత్రం వాట్సప్ లో తెగ తిరుగుతోంది.