భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా మండిపోతున్నాయి. దీంతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయ.
ప్రతి రోజూ పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డును తాకుతున్నాయి. వరుసగా పదవ రోజు (18-2-2021) ఇంధనం ధరలు పెరిగాయి.
గురువారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలుపై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచాయి. దీంతో అన్ని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
ఇలా రోజుకు 30 పైసల చొప్పున ధర పెరుగుతూ పోతే మరో ఆరో నెలల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 150కి చేరుకునే అవకాశముంది.
రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలు ధర రూ. 100 దాటినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 100లకు అమ్ముతున్నారు.
తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 89.88 ఉండగా.. డీజిల్ ధర రూ. 80.27గా ఉంది.
ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.34గా రికార్డు స్థాయికి చేరుకుంది. డీజిల్ ధర రూ. 87.32గా ఉంది. ఈ పది రోజుల్లో పెట్రోల్‌పై రూ. 2.93 పైసలు పెరగగా.. డీజిల్‌పై రూ. 3.14 పైసలు పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల రవాణా రంగంపై ప్రభావం చూపుతుండటంతో ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు.
అంతేకాదు ఇంధన ధరల పెరుగుదలపై వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్లాలంటే అనేకసార్లు ఆలోచించాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఈ పెట్రోల్ ధరలు పలు రాష్ట్రాల్లో సెంచరీ కొట్టగా.. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ రూ. 100ల మార్క్‌కు చేరబోతోంది.
ఇంధనం ధరలు పెరుగుదలను చూసి కొత్త వాహనం కొనడానికి సామాన్యుడు భయపడుతున్నాడు. కొనడం అటుంచితే ఉన్న వాహనాన్ని తుక్కు కింద అమ్ముకోవాల్సి వస్తుందేమో అని ఖంగారు పడుతున్నాడు.
భారత దేశ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర మూడంకెల ధరకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా వున్నాయి:
- హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.93.64, డీజిల్ ధర రూ.87.52
- అమరావతిలో పెట్రోలు ధర రూ. 96.03, డీజిల్ ధర రూ. 89.60
- కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 91.11, డీజిల్ ధర రూ.83.86
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.98, డీజిల్ ధర రూ.85.31
- బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.89, డీజిల్ ధర రూ. 85.09