
ఒకవైపు అంతర్జాతీయంగా చమురుధరలు మళ్లీ పరుగు అందుకోగా పంజాబ్ ప్రభుత్వం వాహన దారులకు శుభవార్త అందించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ సమర్పించిన బడ్జెట్‌లో పెట్రో ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోలు ధర రూ.5, డీజిల్ ధర రూ.1 తగ్గనుంది. సోమవారం ధరలు అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.
కొత్తగా పన్నుల వడ్డన ఏమీలేకుండానే రూ. 1,58,493 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై బడ్జెట్ ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.