వ్యవస్థ ను మార్చే శక్తి యువత కు మాత్రమే ఉంది

402
Only youth can change the system
  • తెలుగుదేశం పార్టీ బలోపేతం పై యువనాయకులతో విస్తృత చర్చ
  • తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం
  • సైకిల్ యాత్రకు సిద్ధం కావాలని జైరామ్ చందర్ పిలుపు

తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్. టీ. ఆర్ భవన్ లో జరిగింది. తెలుగు యువత అధ్యక్షుడు డా.పొగాకు జైరామ్ చందర్ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన యువ ప్రతినిధులతో విస్తృత చర్చ జరిపి, తెలుగు దేశం పునర్వైభవానికి త్వరలో చేపట్టబోయే సైకిల్ యాత్ర కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

యువ వనరుల గురించి మాట్లాడుతూ యువత అధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థులు, యువత సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సామాజిక టీమ్ వర్క్ తో విజయాలు సాధించడం అలవర్చుకోవాలి అని అన్నారు.

యువ నాయకులతో చర్చించిన ఆయన నినాదాలతో కాకుండా పార్టీ విధి విధానాలను, పార్టీ సంస్కృతి చూసి, అమలు చేసే వ్యక్తుల నేపధ్యాన్ని పరిశీలించి అప్పుడు ఓటు వేయమని అడగండి అని వివరించారు.

ప్రణాళికాబద్ధంగా , నిబద్దత తో పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సైకిల్ యాత్రలో పాల్గొనాలని, సామాన్యులకు సైతం పార్టీ లో ఎదిగే అవకాశం మన తెలుగుదేశం పార్టీ లో మాత్రమే ఉందని అలాగే యువతలో సత్తా ఉంటే మార్పు దానంతట అదే వస్తుంది అని తెలియజేసారు.