మరోసారి పెరిగిన వంట గ్యాస్‌ ధర

227
Once again price of LPG gas risen

చమురు కంపెనీలు మరోసారి వంట గ్యాస్‌ ధరలను పెంచాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ పై ఆధనంగా మరూ రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించాయి.

తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.794కు చేరింది.

గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఫిబ్రవరి నెలలో మూడోసారి. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా, 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. మొత్తం మూడుసార్లు సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.100 పెంచాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో సిలిండర్ ధరలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి.

పెరిగిన చమురు ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా మరోసారి పెరిగిన సిలిండర్‌ రేట్ల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లను అనుగుణంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరను పెంచుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం ఒకే నెలలో మూడు సార్లు పెరిగాయి.