అమీర్‌పేట్‌ నుంచి నిమ్స్‌ వరకు వాహనాలకు నో ఎంట్రీ

1072
no entry for vehicles from ameerpet to nims

అమీర్‌పేట్‌ నుంచి నిమ్స్‌ వరకు..43 రోజుల పాటు నిబంధనలు..రేపటి నుంచి అమలు

హైదరాబాద్‌ సిటీ (తీన్ మార్ న్యూస్): విద్యుత్‌ శాఖకు సంబంధించిన భూగర్భ కేబుళ్ల పనుల్లో భాగంగా శ్రీనగర్‌ కాలనీ రోడ్‌ (బిగ్‌బజార్‌ వెనక) నుంచి నిమ్స్‌ ఆస్పత్రి (రెడ్‌ రోజ్‌ హోటల్‌) వరకు భారీ వాహనాలను అనుమతించడం లేదని హైదరాబాద్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఈ నిబంధనలు ఈ నెల 19 నుంచి మే 31 వరకు (43 రోజులు) అమల్లో ఉంటాయి.



 

సంగారెడ్డి, జహీరాబాద్‌, పటన్‌చెరువుల నుంచి వచ్చే ఆర్టీసీ, జిల్లా బస్సులను కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద మళ్లిస్తారు. ఆయా బస్సులు నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్‌, బాలానగర్‌, ఫేరోజ్‌గూడ, బోయిన్‌పల్లి జంక్షన్‌, తాడ్‌బండ్‌ జంక్షన్‌, సీటీఓ జంక్షన్‌, ప్యారడైజ్‌ హోటల్‌ జంక్షన్‌, ఎంజీరోడ్‌, రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌, రవీంద్రభారతీల మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

పటాన్‌చెరు, మియాపూర్‌, కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్‌, పంజాగుట్టల మీదుగా ఆంధ్రా, రాయలసీమలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను మైత్రివనం వైపు వెళ్లకుండా కూకట్‌పల్లి వైపు మళ్లిస్తారు. ఎస్సార్‌ నగర్‌ గౌతం డిగ్రీ కాలేజీ ఎదురుగా యూ టర్న్‌ చేసుకుని ప్యా సింజర్లను తీసుకోవాల్సి ఉంటుంది.

పటాన్‌చెరు, మియాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, తప్పని సరిగా వెళ్లాల్సిన పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ భారీ వాహనాలను ఎస్సార్‌ నగర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి కమ్యూనిటీ హాల్‌, ఆర్‌అండ్‌బీ సిగ్నల్‌, సోనాబాయి టెంపుల్‌, అమీర్‌పేట్‌ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్‌, డికె రోడ్‌ జంక్షన్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌, హోటల్‌ ఐటీసీ కాకతీయ షెరటాన్‌, మోనప్ప ఐలాండ్‌, సోమాజిగూడ రోడ్‌, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

క్రిష్ణానగర్‌ నుంచి వచ్చే ఆర్టీసీ, ఇతర భారీ వాహనాలను శ్రీనగర్‌ కాలనీ జీహెచ్‌ఎంసీ పార్క్‌ నుంచి శ్రీనగ ర్‌ టీ జంక్షన్‌, ఎంజే ఇంజనీరింగ్‌ కాలేజీ, నాగార్జున సర్కిల్‌, జీవీకే వన్‌ మాల్‌, తాజ్‌క్రిష్ణా జంక్షన్‌, కేసీపీ జంక్షన్‌, చీఫ్‌ ఇంజనీరింగ్‌ ఆఫీస్‌ నుంచి ఖైరతాబాద్‌ వైపు అనుమతిస్తారు.


క్రిష్ణానగర్‌ నుంచి బేగంపేట, ఎస్సార్‌నగర్‌ వైపు వెళ్లాల్సిన వాహనాలను క్రిష్ణానగర్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి యూసు్‌ఫగూడ చెక్‌పోస్ట్‌, యూసు్‌ఫగూడ బస్తీ, క్రిష్ణకాంత్‌ పార్క్‌, కళ్యాణ్‌ నగర్‌ జంక్షన్‌, వెంగళరావు నగర్‌ వైపు అనుమతిస్తారు.

1 COMMENT

Comments are closed.