అప్పుడే పుట్టిన ఆడశిశువును గోనె సంచిలో కట్టి కసాయి తల్లిదండ్రులు చెత్తకుండిలో పడేశారు.
ఈ దారుణ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో జరిగింది.
డోర్నకల్ మండలంలో చెత్తకుండిలోఅప్పుడే పుట్టిన ఆడశిశువును గోనె సంచిలో కట్టి కసాయి తల్లిదండ్రులు చెత్త కుండీలో వేశారు.
బూరుగుపాడు గ్రామ కూలీలు వ్యవసాయ పనికి వెళ్లే క్రమంలో శిశువు ఏడుపు వినిపించింది.
వెంటనే గమనించి చెత్తకుండిలోని గోనె సంచిలో ఉన్న శిశువు ను తీసి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు అంటున్నారు.
ఆడపిల్ల పుట్టినందునే అలా వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనకు పాల్పడ్డ కసాయి తల్లిదండ్రులను వదలొద్దని గ్రామస్తులు అంటున్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఈ దారుణం జరగడంతో గ్రామస్తులు ఖంగుతిన్నారు.