ఆధార్ కార్డు. మన ఐడెంటెటీని తెలియజేసే కార్దు ఇది. ఈ కార్దు అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది.
లోన్స్ కావాలన్నా, లైసెన్స్ అప్లయ్ చేయాలన్నా ఇలా అనేక అవసరాలకు పనికొస్తుంది.
కానీ దీన్ని మనం పాకెట్‌లో పెట్టుకుని తిరగలేం. ఈ ఆలోచనతోనే పర్సులో పెట్టుకునేలా ఆధార్ కార్డును యూఐడీఏఐ రూపొందించింది.
అంటే బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల సైజులో కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి. ఈ కొత్త కార్డు కావాలంటే ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
పది రోజుల్లో మీరిచ్చిన ఇంటి అడ్రస్‌కు ఈ కొత్త ఆధార్ కార్డు వచ్చేస్తుంది.
ఈ ఆధార్ కార్డ్‌ను సులభంగా పర్సులో పెట్టుకుని తిరిగేలా మార్పులు చేసింది. పీవీసీ (పాలి వినైల్ క్లోరైడ్) కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ పివీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ కూడా ఉంటుంది. ఈ కొత్త పీవీసీ ఆధార్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలంటే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
దరఖాస్తుకు రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా పీవీసీ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలో ఓసారి చూద్దాం.
- పీవీసీ ఆధార్ కార్డు అప్లయ్ చేసే ముందు UIDAI వెబ్‌సైట్(https://uidai.gov.in/)ను ఓపెన్ చేయండి
- Get Aadhaar అనే ఆప్షన్ కింద Order Aadhaar PVC Card అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయాలి.
- ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
- ఆధార్ నెంబర్ బదులుగా వర్చువల్ ఐడీ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ కూడా ఎంటర్ చేయవచ్చు.
- ఇప్పుడు క్యాప్చా (Captcha) కోడ్‌ను ఎంటర్ చేసి.. Send OTPపై క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో రీచెక్ చేసుకోండి.
- My Mobile number is not registered అనే ఆప్షన్ ఉంటుంది.
- అక్కడే పక్కన ఉన్న బాక్స్‌లో క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
- Send OTPపై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేసి Submit చేయండి.
- అప్పుడు ఫొటోతో సహా వివరాలన్నీ వెబ్‌సైట్ పేజిపై కనిపిస్తాయి. సరిచూసుకున్న తర్వాత Make Paymentపై క్లిక్ చేయండి.
- పేమెంట్ పేజిలోకి వెళ్తే క్రెడిట్ కార్డు\డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు ఉంటాయి. యూపీఐ ఆప్షన్‌లో పేటీఎం,
- గూగుల్ పే, ఫోన్ పే ఆప్షన్లు ఉన్నాయి.
- పేమెంట్ పూర్తయిన తర్వాత రిసిప్ట్ కూడా వస్తుంది. SRN నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం వాడొచ్చు.
- పది రోజుల్లో ఆధార్ కార్డులోని అడ్రస్‌కు పీవీసీ కార్డు చేరుతుంది.
- SRN నంబర్ ఉపయోగించి యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని Get Aadhaar విభాగంలో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.