దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్ట్ అందజేయాల్సి ఉంటుంది.
నెగెటివ్ రిపోర్ట్ ఉంటే రాష్ట్రంలోకి అనుమతించాలని కేజ్రివాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఈ నిబంధనను వచ్చే శుక్రవారం నుంచి అమలు చేయనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మేరకు నేడో రేపో ఆదేశాలు జారీ చేయనుందని వెల్లడించాయి.
దీంతో ఈ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ నిబంధన మార్చి 15 వరకు అమల్లో ఉంటుదని పేర్కొన్నాయి.దేశ రాజధానిలో గతవారం 86 శాతం కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి.
వైరస్ వ్యాప్తికి ఈ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చినవారే కారణమని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.