ఏబీఎన్’చానల్ పై నాగబాబు సెటైర్స్

288
abn channel

మెగా బ్రదర్ నాగబాబు డైరెక్ట్ గా ఏబీఎన్ ఛానల్ ని టార్గెట్ చేస్తూ సటైర్స్ వేశాడు. ‘నా ఛానల్ నా ఇష్టం’ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన నాగబాబు తనదైన శైలిలో పొలిటికల్ సటైర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి నాగబాబు ఏబీఎన్ పై పడిపోయారు. ఇటీవల ఏపీ మంత్రి నారాలోకేష్ దావోస్ పర్యటనకి సంబంధించి ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసిన ఓ కథనాన్ని తీసుకొని.. సటైర్స్ వేశారు.




 

దావోస్ సదస్సుకు వెళ్లిన లోకేష్ అనుభవంపై ABN ప్రసారం చేసిన ఓ కథనాన్ని ప్రదర్శిస్తూ, దాన్ని చూస్తూ నాగబాబు కూడా భజన చేస్తూ, కామెంట్ లు చేస్తూ, సెటైర్ లు వేస్తూ, ఓ వీడియో తయారుచేసారు. టోటల్ గా ఈ వీడియో ద్వారా ABN ఛానెల్ బాబుకు, లోకేష్ కు భజన చేస్తోందని డైరెక్ట్ గానే చెప్పేసారు. మరీ.. నాగబాబు సటైర్స్ పై ఏబీఎన్ ఛానల్ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి.