మొలకెత్తని సోయా పంట చేలను పరిశీలించిన ముధోల్ ఎమ్మెల్యే

277
Vittal Reddy

-రైతులు ఆందోళన చెందవద్దు
-నష్టపరిహారం అందిస్తామని హామీ

మొలకెత్తని సోయా పంట రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని మన్మాడ్, హవర్గా గ్రామాలు, కుంటాల మండలం ఓల, లింబా కే గ్రామాల్లో ఆయన పర్యటించారు.

నియోజకవర్గంలో సోయా సరిగా మొలకెత్త లేదనే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్రుష్టి కి తీసుకెళ్లగా వారు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వమని ఆదేశించారని చెప్పారు.

రైతులు వారి వద్ద ఉన్న కొనుగోలు రశీదు, విత్తనాల సంచి మరియు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, పట్టా పాస్ పుస్తకం తీసుకొని సంభందిత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సంప్రదిస్తే ఆ అమౌంట్ వారి ఖాతాలో జమ చేస్తారన్నారు, మరియు విత్తనాలు వేసిన రైతులకు క్షేత్ర స్థాయిలో అధికారుల ద్వారా సర్వే నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఎంత మేర రైతులు నష్టపోయారు అనే దానిపై సంబంధిత అధికారులు సర్వే చేస్తున్నారని, రేపటిలోగా నివేదిక అందుతుందన్నారు. సోయా పంట మొలకెత్తని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలియజేసారు. ఆయన వెంట నిర్మల్ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.