చెక్కబొమ్మతో వివాహం చేసిన తండ్రి

360
pancharaj marriage

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ లో ఒక ప్రత్యేక వివాహం జరిగింది. వివాహ మండపం అలంకరించబడింది. అతిథులు విందును ఆరగించారు, ప్రతిదీ ఒక సాధారణ వివాహం లాగా నిర్వహించబడింది. కానీ ఈ వివాహంలో వరుడు ఉన్నాడు కాని వధువు లేదు. వధువు స్థానంలో చెక్కబొమ్మ తో వరుడు ఏడు అడుగులు వేసాడు. ఈ వింత వివాహం ఉత్తర ప్రదేశ్‌లో వైరల్ అయ్యింది.

ఈ ప్రత్యేక వివాహం జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైద్పూర్ గ్రామంలో జరిగింది. యువకుడి చెక్కబొమ్మను వివాహం చేసుకోవడానికి కారణం కూడా ప్రత్యేకమైనది.

man married girl statue

రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శివ్ మోహన్ అనే 90 ఏళ్ల పెద్దకు 9 మంది కుమారులు ఉన్నారు. వీరిలో 8 మంది కుమారులు వివాహం చేసుకున్నారు, కాని చిన్న కుమారుడు పంచరాజ్ వివాహం చేసుకోలేదు. తానూ చదువుకోనందున తన పిల్లలందరికీ చదువు నేర్పించాలని అనుకున్నాను. అందరు బాగా చదువుకున్నారు కానీ పంచారాజ్ చదువలేకపోయాడు. అంతేకాక పంచరాజ్ కొంత మానసికంగా బలహీనుడు. తాను ఉండగానే పంచరాజ్ కు పెళ్లి చేయాలని అనుకున్నాను. దానికి మా కుటుంబం అంతా ఆమోదించారు. అతని కోసం ఒక అమ్మాయిని వెతకడం ప్రారంభించాము. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆస్తి లేకపోవటం, చదువు లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం వల్ల అతనికి ఎవరూ పిల్లనివ్వలేదు.

పురోహితుడి ఆలోచన

ఈ విషయంలో శివమోహన్ పురోహితుడి సలహా తీసుకొని పంచరాజ్‌కు చెక్క దిష్టిబొమ్మతో వివాహం చేయాలనే ఆలోచనను రూపొందించారు. అప్పుడు పంచరాజ్ ను కూడా అందరు వివాహితుడే అని పిలుస్తారు. మొదట పంచరాజ్ ఈ వివాహం చేయడానికి నిరాకరించాడు. కానీ తర్వాత తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం, ఆయ‌న గౌర‌వాన్ని నిల‌బెట్టేందుకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. అయితే ఈ పెళ్లి పూర్తి ఆచార వ్యవహారాలతో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జరగడం విశేషం.

shivamohan son marriage

ఈ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వివాహ వేడుక‌కు హాజ‌రైన వారంద‌రికీ కూడా విందు ఏర్పాటు చేశారు.